![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -86 లో..... శైలు తన ఫోన్ కేశవ దగ్గర నుండి తీసుకొని రీల్స్ చేస్తుంది. ప్లీజ్ రోజుకు రెండు రీల్స్ చేసి ఇస్తాను ఫోన్ ఇస్తారా అని కేశవని శైలు రిక్వెస్ట్ చేస్తుంది. నాకు ఆ టార్చర్ వద్దు బాబోయ్.. నువ్వు నీ ఫోన్ తీసుకోమని కేశవ అంటాడు. మరి నా దగ్గర డబ్బు లేదని శైలు అంటుంది. సరే ఉన్నప్పుడు ఇవ్వమని కేశవ అంటాడు. నేను పారిపోతే అని శైలు అనగానే మీ నాన్న నెంబర్ సేవ్ చేసానని కేశవ అంటాడు. థాంక్స్ అని శైలు హ్యాపీగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కేశవ, చక్రి, కన్నా, మహా నలుగురు కూర్చొని మాధవకి పెళ్లి సంబంధం చూడడానికి మాట్రిమోనీలో మాధవ ఫొటోస్ పెడతారు. అప్పుడే మాధవ వచ్చి ఏంటి నలుగురు ఒక దగ్గర కూర్చొని ఉన్నారు.. అంటే ఏదో చేస్తున్నారని అర్థం అని మాధవ అంటాడు.
ఏం లేదు పెద్ది.. నీకు మంచి సంబంధం కోసం మ్యాట్రీమోనిలో సంబంధం చూస్తున్నామని మహా చెప్పగానే అదంతా ఎందుకని మాధవ అంటాడు. అంటే నువ్వు ఇంకా గాయత్రిని మర్చిపోలేదు అన్నమాట అని చక్రి అంటాడు. అదేం లేదు మర్చిపోయానని మాధవ అంటాడు. ఇక చేసేదేమీ లేక సరే మీ ఇష్టం అని మాధవ అనగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత నారాయణ డ్రింక్ చెయ్యడానికి మందు తెచ్చుకుంటాడు. వద్దు ట్యాబ్లెట్ వేసుకోవాలని మహా ఆపుతుంది. కేశవ వాళ్ళని పిలిచి మందు సేసా లాక్కోమని చెప్తుంది మహా. ఆ తర్వాత మాధవ ప్రొఫైల్ నచ్చి ఒక సంబంధం ఒకే అంటారు. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మాధవ మాత్రం గాయత్రిని గుర్తుచేసుకుంటాడు. మరుసటి రోజు మహాని ఇంప్రెస్ చెయ్యడానికి చక్రి స్నానం చెయ్యకుండానే పూజ చేస్తాడు. అప్పుడే కేశవ, కన్నా వచ్చి చక్రిని ఆటపట్టిస్తారు. వాడు స్నానం చెయ్యకుండా పూజ చేశాడని కేశవ అనగానే మహా కోప్పడుతుంది.
ఆ తర్వాత మాధవ ప్రొఫైల్ నచ్చిన వాళ్ళు ఫోన్ నెంబర్ పెడతారు. చక్రి వాళ్ళతో ఫోన్ మాట్లాడితే అందరి గురించి ఎలా బిల్డప్ ఇస్తాడోనని మహా ఇమిటేట్ చేస్తుంది. ఆ తర్వాత మహా అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. మంచి రోజు చూసుకొని రమ్మని వాళ్ళు చెప్పగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ విషయం నారాయణకి చెప్పడానికి తనని లోపలికి పిలుస్తారు. నాకెందుకు చెప్పడం మీరు ఉండగా అంటూ అతను వెటకారంగా మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |